రేపు ఆ మార్గాల్లో 36 ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు
SCR cancels 36 MMTS trains temporarily. దక్షిణ మధ్య రైల్వే సోమవారం 36 ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను రద్దు చేయాలని
By Medi Samrat Published on 16 Jan 2022 2:09 PM GMT
దక్షిణ మధ్య రైల్వే సోమవారం 36 ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. కార్యాచరణ కారణాలు, ట్రాక్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణీకులను అలర్ట్ చేసింది. లింగంపల్లి నుండి హైదరాబాద్ మధ్య నడిచే మొత్తం 18 (47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140, 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120) నెంబర్ గల ట్రైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడిచే 16 ట్రైన్స్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. రైలు నంబర్లు 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170, 47176, 47189, 47186, 47210, 47187, 47187, 247187, 21971 అందుబాటులో ఉండవని పేర్కొంది. అలాగే సికింద్రాబాద్, లింగంపల్లి మధ్య రెండు సర్వీసులు (రైలు నంబర్లు 47150, 47195) ఒక రోజు పాటు రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.