హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు సోమవారం నాడు సెలవు ప్రకటించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు, రేపు బోనాల పండగ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నగరంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా ప్రతియేటా హైదరాబాద్ మొత్తానికి ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. ఈ లెక్కన జులై 21న ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. సోమవారం మాత్రం సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని విద్యాసంస్థలు మాత్రమే సెలవు ప్రకటించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం అందించాయి కాలేజీ యాజమాన్యాలు.