Hyderabad: స్కూల్‌లో దారుణం.. ఆయా కాదు మృగం.. చిన్నారిపై పైశాచిక దాడి.. వెలుగులోకి వీడియో

మేడ్చల్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్లో పనిచేస్తున్న ఆయమ్మ ఓ చిన్నారిపై అతి కిరాతకంగా దాడి చేసిన...

By -  అంజి
Published on : 1 Dec 2025 8:52 AM IST

School Worker, Three Year Old Child, Medchal district, Crime, attack

Hyderabad: స్కూల్‌లో దారుణం.. ఆయా కాదు మృగం.. చిన్నారిపై పైశాచిక దాడి.. వెలుగులోకి వీడియో

మేడ్చల్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్లో పనిచేస్తున్న ఆయమ్మ ఓ చిన్నారిపై అతి కిరాతకంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో ఉన్న పూర్ణిమ స్కూల్లో పనిచేస్తున్న ఆయమ్మ.. అదే స్కూల్లో నర్సరీ స్కూల్ చదువుతున్న ఓ చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి.

ఆయమ్మ కొడుతూ ఉన్నా కూడా చిన్నారి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది.. అయితే స్కూల్ పక్కనే ఉన్న ఓ ఇంటి పై అంతస్తు నుండి యువకుడు ఇదంతా గమనించాడు. వెంటనే ఆ యువకుడు వీడియో తీసి బయట పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి నిన్న ఇంటికి వెళ్లిన తర్వాత ఆహారం తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు పాపను పట్టుకొని చూడగా తీవ్ర జ్వరంతో వణికిపోతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న రామ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

వైద్యులు చిన్నారిని పరీక్షించి.. చిన్నారి శరీరంపై అనుమానస్పద గాయాలు గమనించి తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు మొదటగా స్కూలుకు వెళ్లి స్కూల్ యజమాన్యాన్ని నిలదీసి అడిగారు. ఇది చాలా చిన్న విషయం వదిలేయండి అంటూ స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు యువకుడు ఇచ్చిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని చిన్నారిపై దాడి చేసిన ఆయాను పోలీస్ స్టేషన్‌కి పిలిచి విచారణ ప్రారంభించారు.

Next Story