అభిమానుల‌ను క‌ల‌వ‌నున్న సానియా మీర్జా.. ప్లేస్‌, టైం కూడా చెప్పేసింది..!

భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఈ వారం హైదరాబాద్‌లో తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధమవుతోంది.

By Medi Samrat  Published on  25 March 2024 6:29 PM IST
అభిమానుల‌ను క‌ల‌వ‌నున్న సానియా మీర్జా.. ప్లేస్‌, టైం కూడా చెప్పేసింది..!

భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఈ వారం హైదరాబాద్‌లో తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఆమె సోదరి, వ్యాపారవేత్త అనమ్ మీర్జాకు చెందిన‌ రంజాన్ ఎక్స్‌పో 'దావత్-ఎ-రంజాన్'లో బుధవారం నుండి ప్రారంభం కానుంది.

సానియా మీర్జా షాపింగ్, ఫుడ్ కార్నివాల్‌కి తన అభిమానులను, అనుచరులను ఆహ్వానిస్తూ ఒక వీడియో సందేశం విడుద‌ల‌ చేసింది.. అస్సలామువాలికుమ్ హైదరాబాద్, నేను సానియా మీర్జా నేను దావత్-ఎ-రంజాన్‌కు వస్తున్నాను. మీ అందరినీ అక్కడ చూడాలని నేను ఆశిస్తున్నాన‌ని పేర్కొంది.

మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు ఎక్స్‌పో కొనసాగుతుంది. దావత్-ఎ-రంజాన్ ఈద్‌కు ఒక రోజు ముందు ముగుస్తుంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఆహారం, దుస్తులు, ఆభరణాలు కలిగి ఉన్న విభిన్న స్టాల్స్‌తో ఎక్స్‌పో ఉంటుంది. సందర్శకులకు హలీమ్, కబాబ్‌లు, బిర్యానీలు, స్వీట్‌లతో సహా వివిధ రకాల రంజాన్ రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంటాయి.


Next Story