వాళ్ళను టెర్రరిస్టులతో పోల్చిన సజ్జనార్

Sajjanar About New Year Celebrations. వీకెండ్స్ వస్తే చాలు తాగి డ్రైవ్ చేసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఇక న్యూ ఇయర్ లాంటి

By Medi Samrat  Published on  29 Dec 2020 10:38 AM GMT
వాళ్ళను టెర్రరిస్టులతో పోల్చిన సజ్జనార్
వీకెండ్స్ వస్తే చాలు తాగి డ్రైవ్ చేసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఇక న్యూ ఇయర్ లాంటి సమయాల్లో తాగి వాహనం తీసుకుని రోడ్డు మీద చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ సంవత్సరం ముగియనుండడంతో డిసెంబర్ 31న మస్త్ తాగి చిందేద్దామని అనుకునే వాళ్ళే ఎక్కువ. హైదరాబాద్ లో మద్యం తాగి పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని అంటోంది పోలీసు శాఖ. ఇన్నాళ్లూ కాస్త సైలెంట్ గా ఉన్న హైదరాబాద్ నగరంలో ఈ మధ్యనే పార్టీలు, పబ్ కల్చర్ లు పెరిగిపోయాయి. పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహిస్తూ ఉన్నారు. సోమవారం ఒక్కరోజే నగరంలో 420 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో పట్టుబడ్డారు.


తాజాగా సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల గురించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. అదే విధంగా నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని అన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని వెల్లడించారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.


Next Story