నిలోఫర్‌ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సేఫ్‌

Safe child kidnapped at Nilofar Hospital. బుధవారం హైదరాబాద్‌ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే.

By అంజి  Published on  2 March 2022 8:35 AM GMT
నిలోఫర్‌ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సేఫ్‌

బుధవారం హైదరాబాద్‌ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. కిడ్నాప్‌కు గురైన చిన్నారి, కిడ్నాపర్‌ విజువల్స్‌ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు గంటలో కిడ్నపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 18 నెలల పాపను రక్షించారు. అత్తాపూర్ సమీపంలోని కోమటి కుంట కల్లు కంపౌండ్ వద్ద నిందితురాలిని నాంపల్లి క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ చేసిన మహిళతో పాటు పాపను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా షహాబాద్ మండలం నుంచి చిన్నారి తన తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. "తల్లి గర్భవతి, బిడ్డను బయట వదిలి వైద్యుడిని సంప్రదించడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి బాలిక కనిపించకుండా పోయిందని నాంపల్లి ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ.. ఆచూకీ కోసం గాలించారు. మహిళను నార్సింగి వరకు ట్రాక్ చేసినట్లు తెలిసింది. మూడు ప్రత్యేక బృందాలతో గాలించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
Next Story
Share it