హిమాయత్ నగర్‌లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు

Road Collapse at Himayat Nagar. హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ స్ట్రీట్ నంబ‌ర్ 5లో రోడ్డు కుంగిపోయింది.

By Medi Samrat
Published on : 28 Jan 2023 4:44 PM IST

హిమాయత్ నగర్‌లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు

హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ స్ట్రీట్ నంబ‌ర్ 5లో రోడ్డు కుంగిపోయింది. అదే స‌మ‌యంలో ఆ ర‌హ‌దారిపై వెళ్తున్న టిప్ప‌ర్ రోడ్డులోకి కుంగిపోయింది. టిప్ప‌ర్ డ్రైవ‌ర్, ఇద్ద‌రు కార్మికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. రోడ్డు కుంగిపోవ‌డంతో అక్క‌డ భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు పోలీసులు శ్ర‌మిస్తున్నారు. రోడ్డు ప‌క్క‌నే నాలా ప్ర‌వాహం ఉండ‌టంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఇటీవల గోషామహల్ లో రోడ్డు కుంగిపోయి వాహనాలు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే ఇప్పుడు హిమాయత్ నగర్ లో చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాలు నెలకొన్నాయి.


Next Story