Hyderabad: పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ నగర శివారులోని రాజేంద్రనగర్‌ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం సంభంవించింది.

By అంజి
Published on : 16 July 2023 10:22 AM IST

Road accident , PV Narasimha Rao Flyover, Hyderabad

Hyderabad: పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌: నగర శివారులోని రాజేంద్రనగర్‌ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం సంభంవించింది. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఓ కారు టైరు పెద్ద శబ్దంతో బ్లాస్ట్ కావడం డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్లియర్‌ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా యాచారం పోలిస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్ హైవేపై వెళ్తున్న బైకు.. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన క్రూజర్ వాహనం బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. చనిపోయిన వారిని మహబూబ్ నగర్ జిల్లా, మలిగిల్ల ప్రాంతానికి చెందిన వడ్ల వీరబ్రహ్మం (45), మర్రిగూడ మండలంలోని తిరుగాళ్లపల్లికి చెందిన నారోజు శాల్వాచారి (40)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story