Hyderabad: కేపీహెచ్‌బీలో కారు బీభత్సం.. మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు!

హైదరాబాద్‌ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారును రాంగ్‌ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి బైక్‌ని ఢీ కొట్టారు.

By అంజి  Published on  8 Jan 2024 10:55 AM IST
Road accident, KPHB,  wrong route, Hyderabad

Hyderabad: కేపీహెచ్‌బీలో కారు బీభత్సం.. మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు! 

హైదరాబాద్‌ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో కారును రాంగ్‌ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి బైక్‌ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న అర్ధరాత్రి మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ కారు బీభత్సం సృష్టిస్తూ హంగామా చేశాడు. అగ్రజ్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఆ మద్యం మత్తులో (కారు నంబర్ AP07E 3839) హోండా సిటీ కారు నడుపుతూ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయా లయ్యాయి. ప్రమాదం సమయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు.

గచ్చిబౌలిలోని ఓ పబ్ లో పార్టీ చేసుకున్న అగ్రజ్ రెడ్డి ( 26) తన స్నేహితులు కార్తీక్, తేజలతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ మత్తులో కారు డ్రైవర్‌ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కారు నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించింది తెలుస్తోంది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు అగ్రజ్ రెడ్డికి బ్రీత్ అనలైజ్ టెస్ట్‌ చేశారు. ఆల్కహాల్ 90 శాతం నమోదు అయింది. రాంగ్ రూట్ లో వచ్చి ద్విచక్ర వహనాన్ని డీ కొట్టిన అగ్రజ్ హోండా సిటీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసి టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని కేపీహెచ్‌బీ పోలీసులు ఐపీసీ 185(ఏ), 337, 119 177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గాయపడ్డ రాజస్థాన్ చెందిన దూర్ చంద్, బాన్వర లాల్‌లను స్థానిక ఆస్పత్రికి తరలించారు

Next Story