నగరంలో రక్షణ లేనప్పుడు.. పెట్టుబడులు ఎలా వస్తాయి.?
Renuka Chowdary Fire On Govt. రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళలపై అత్యాచారాలు జరిగాయని కేంద్ర మాజీ మంత్రి
By Medi Samrat Published on 7 Jun 2022 3:16 PM ISTరాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళలపై అత్యాచారాలు జరిగాయని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. పోలీసుల లెక్కలు చూస్తే.. మహిళలలపై అత్యాచారాలు పెరిగాయని.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అని ఆమె ప్రశ్నించారు. పసి పిల్లలకు కూడా తెలంగాణ లో రక్షణ లేదని ఫైరయ్యారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసు ను నీరుగారుస్తున్నారని విమర్శించారు. వేల కేసులు నమోదయితే.. 46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడిందని ఉదహరించారు.
మైనర్ బాలిక వీడియోను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునంధన్ రావు దోషే అని రేణుక చౌదరి అన్నారు. రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారన్న ఆమె.. పబ్ లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటే.. రఘునంధన్ రావు బయట పెట్టాలని సవాల్ విసిరారు. అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ షీ టీమ్స్ ఏమైయ్యాయి అని నిలదీసిన ఆమె.. నగరం లో రక్షణ లేనప్పుడు.. పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
బీజేపీ విషయంలో టిఆర్ఎస్ యూ టర్న్ తీసుకుందని ఆరోపించారు. బీజేపీ, టిఆర్ఎస్ తోడు దొంగలని.. కవల పిల్లల లాంటి వారని అన్నారు. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగిందని.. లైసెన్స్ లు ఇస్తుంది.. ఎక్సైజ్ శాఖ కాదా.. అని ప్రశ్నించారు. బీజేపీ మరో మతాన్ని కించరపరచడం సరైంది కాదని.. సనాతన ధర్మం బీజేపీకి తెలుసా అని ప్రశ్నించారు. ప్రపంచం ముందు సిగ్గుపడేలా బీజేపీ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు రేణుకా చౌదరి.