అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.
By Medi Samrat Published on 11 Jan 2025 2:45 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలనే షరతు నుండి మినహాయింపు ఇచ్చింది. అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలలో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్ భద్రతాపరమైన సమస్యలను పేర్కొంటూ మినహాయింపును కోరారు. అంతేకాకుండా బన్నీ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.
జనవరి 3న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50,000 రెండు పూచీకత్తులను అందించాలని కోరింది. బెయిల్ షరతులో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని తొలుత ఆదేశించింది. పుష్ప 2: ది రూల్ థియేటర్లలో అధికారికంగా విడుదల కావడానికి ఒక రోజు ముందు డిసెంబర్ 4 న జరిగిన విషాద సంఘటన తరువాత అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్‌కు హాజరైనప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణానికి దారితీసింది. ఆమె బిడ్డ శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.