మామూలుగా ప్రతి షాపులకు రెగ్యులర్ కస్టమర్లు ఉండడం చూస్తుంటాం. అయితే.. ఇక్కడ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఓ రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు. అదేంటి.. పోలీసులకు రెగ్యులర్ కస్టమర్ ఏంటి అనేగా మీ సందేహాం.. ఏం లేదండి.. ఓ వ్యక్తి ఎన్ని సార్లు చలానా అయినా కడుతా కానీ.. హెల్మెట్ మాత్రం పెట్టుకోను అని అంటున్నాడు. ఇప్పటి వరకు హెల్మెట్ లేనందుకు దాదాపు రూ.1000 చలానా కట్టాడు. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే.. ఏ రోజు అయితే.. చలానా పడుతుందో ఆ రోజే అతడు చలానాలు కడుతుండడం గమనార్హం. దీన్ని గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ మీమ్ తయారు చేసి తయారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
'నాకో డౌట్ గురువు గారు అడగొచ్చా.. ఏ రోజు పడ్డ చలానాలు ఆరోజు కట్టే బదులు.. ఆ హెల్మెట్ ఏదో పెట్టుకోవచ్చుగా' అంటూ ఓ ఫన్నీ మీమ్ క్రియేట్ చేసి ట్రాఫిక్ పోలీసులు ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వెయ్యి కాదు.. ఇంకో వెయ్యి అయినా చలానా కడుతా కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోను అంటూ కొందరు ఫన్నీ కామెంట్లు పెట్టగా.. ప్రమాదం నుంచి హెల్మెట్లు ప్రాణాన్ని కాపాడుతాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకో బ్రదర్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.