"ఖలీద్ కా శివాజీ" అనే సినిమాపై వివాదం నడుస్తూ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని వక్రీకరించే ప్రయత్నం అని ఆరోపిస్తూ, మరాఠీ సినిమా "ఖలీద్ కా శివాజీ"పై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలని గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ డిమాండ్ చేశారు.
ఈ సినిమా శివాజీ మహారాజ్‌ను కించపరిచే ప్రయత్నం అని రాజా సింగ్ అన్నారు. "వాస్తవాలు నిజమైతే, ముస్లింలు మొఘల్ రాజు ఔరంగజేబు సమాధి వద్దకు ఎందుకు వెళతారు. దేశంలోని ముస్లింలు మొఘల్ రాజులను రోల్ మోడల్స్‌గా ఎందుకు చూస్తారు?” అని రాజా సింగ్ ప్రశ్నించారు. “ఖలీద్ కా శివాజీ ప్రదర్శించబడే థియేటర్‌లను తగలబెట్టాలి. ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్న నిరంకుశుల చరిత్రను మేము మారుస్తాము” అని రాజా సింగ్ అన్నారు. మహారాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అనుచరులు ఈ సినిమాను అడ్డుకోవాలని రాజా సింగ్ కోరారు. ఖలీద్ కా శివాజీ చిత్రాన్ని దర్శకుడు రాజ్ ప్రీతమ్ మోర్ తెరకెక్కించారు. 2019లో మరాఠీ చిత్రం ఖిస్సాకు జాతీయ అవార్డు గెలుచుకున్నారు.