ఆ షోను బ్యాన్ చేయాలని రాజాసింగ్ డిమాండ్.. అమిత్ షాకి లేఖ రాస్తా
Raja Singh Demands For BiggBoss Ban. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు
By Medi Samrat Published on 29 Nov 2021 6:05 PM ISTబిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. యాంకర్ రవిని బయటకు పంపడంలో ఏం జరిగిందనేది తెలియాలన్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని రాజా సింగ్ మండి పడ్డారు. ఆ షోను తెలంగాణలో బ్యాన్ చేయాలని ఆయన కోరారు. రియాల్టీ గేమ్ షో లో కంటెస్టెంట్లు శృతి మించుతున్నారని రాజాసింగ్ ఆందోళన చెందారు. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద రవి అభిమానులు గొడవ చేశారని, ఈ గొడవలకు కారణం బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రమేనని అన్నారు. హిందూ దేవుళ్లను బిగ్ బాస్ షోలో అవమానపరుస్తున్నారని రాజాసింగ్ అన్నారు.
యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో ఏదో జరిగిందన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో.. అది బయటకు రావాలని కామెంట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. యాంకర్ రవి ఎలిమినేన్ సందర్బంగా రచ్చ చోటుచేసుకుందని, అసలు ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేసారు. భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు అవసరమా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ షో నిషేదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాస్తానని రాజాసింగ్ స్పష్టం చేసారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్‌పై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుడుతున్నాయి. యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే, కొంత మంది ఆయన అభిమానులు బిగ్ బాస్ సెట్ ఉండే అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట నిరసనలు చేపట్టారు.