బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా సింగ్ ఓ వీడియోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన కంచన్ బాగ్ పోలీసులు వీడియో ఆధారంగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరి మత విశ్వాసాలను కించపర్చేలా తాను కామెంట్స్ చేయలేదని అన్నారు బీజేపీ MLA రాజాసింగ్. మొయినుద్దీన్ కిస్తీ భారతదేశాన్ని మోసం చేసిన వ్యక్తి అని రాజా సింగ్ అన్నారు. మహ్మద్ ఘోరి భారత్ లోకి రావడానికి మొయినుద్దీనే కారణమన్నారు రాజాసింగ్. హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహన్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మొయినుద్దీన్ చిస్తీ అని, అలాంటి మోసగాడి సమాధి ఉన్న అజ్మీర్ దర్గాకు హిందువులు వెళ్లొద్దని మాత్రమే చెప్పానంటున్నారు రాజాసింగ్. మొయినుద్దీన్ చిస్తీ హిందూ ద్రోహి అన్నారు రాజాసింగ్. హిందువులను చంపడమే కాకుండా, చంపించిన వ్యక్తి మొయినుద్దీన్ అన్నారు.