హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ మహా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. వరద నీటి వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

By అంజి  Published on  23 Jun 2024 6:08 PM IST
Heavy Rains, Hyderabad, traffic jam, IMD

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ 

హైదరాబాద్‌ మహా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. నగరం మొత్తం కారు మబ్బులు కమ్ముకున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. వరద నీటి వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయని వెదర్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

నగరంలోని ఫిలింనగర్, అమీర్ పేట, సనత్ నగర్, LB నగర్, నాగోల్, చిక్కడపల్లి , రాంనగర్, ముషీరాబాద్, చైతన్యపురి, కొత్తపేట్‌, ముషీరాబాద్, అశోక్ నగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, అబిడ్స్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, కుతుబుల్లాపూర్‌, అల్వాల్‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. రోడ్డుపై వరద నీరు నిలవడంతో చాదర్ ఘట్ నుంచి దిల్ సుఖ్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసుల చర్యలు చేపట్టారు.

వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్‌ - విజయవాడ నేషనల్‌ హైవే నీటితో నిండిపోయింది. రహదారి విస్తరణ పనులు చేస్తుండటంతో వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చింతల్‌కుంట వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరదనీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

Next Story