హైదరాబాద్ పోలీసు వ్యవస్థలో ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇకపై బాడీ వోర్న్ కెమెరాలు ధరించనున్నారు. ఈ కెమెరాలను అధికారులు తమ విధుల సమయంలో ధరిస్తారు. ప్రజలతో వారి పరస్పర చర్యలను రికార్డ్ చేస్తారు. అధికారులు, ప్రజల మధ్య జరిగే అన్ని పరస్పర చర్యలను రికార్డ్ చేయడం ద్వారా వివాదాలు, ఫిర్యాదుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకుని రావడానికి బాడీ కెమెరాలను ఉపయోగించడం పోలీసుల లక్ష్యం. విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యాన్ని ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం.
ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పరస్పర చర్యలు కూడా రికార్డ్ చేయనున్నారు. వీటి ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు, వివాదాలను కూడా రికార్డు చేయొచ్చు. రాచకొండ పరిధిలోని సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు సహా ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులందరికీ బాడీ కెమెరాలను ఇప్పటికే పంపిణీ చేశారు.