కరోనా టీకా వేయించుకున్న రాచకొండ సీపీ
Rachakonda CP Taken Covid Vaccine. రాచకొండ సీపీ మహేష్ భగవత్ కరోనా టీకా వేయించుకున్నారు. మల్కాజిగిరి పీహెచ్‌సీలో
By Medi Samrat Published on
6 Feb 2021 5:46 AM GMT

హైదరాబాద్ : రాచకొండ సీపీ మహేష్ భగవత్ కరోనా టీకా వేయించుకున్నారు. మల్కాజిగిరి పీహెచ్‌సీలో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. మల్కాజిగిరి ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మొదటగా తానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎటువంటి ఇబ్బంది లేదని.. వైద్య సిబ్బంది అరగంట విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎవరికి ఎలాంటి అపోహ వద్దని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో పోలీసులు ముందుంటారని సీపీ మహేష్ భగవత్ అన్నారు.
Next Story