అప్రమత్తంగా ఉండండి : రాచకొండ సీపీ

ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు రాచకొండ సీపీ చౌహాన్ పేర్కొన్నారు.

By Medi Samrat
Published on : 29 Nov 2023 5:14 PM IST

అప్రమత్తంగా ఉండండి : రాచకొండ సీపీ

ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు రాచకొండ సీపీ చౌహాన్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, ఇబ్రహీంపట్నం సీవీఆర్ కళాశాలలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత మీద సిబ్బందికి అవగాహన కల్పించారు అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షన్ కేంద్రాల చుట్టు ప్రక్కల 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరం లేకుండా వీధుల్లో గుమిగూడడం నిషేధించినట్టు పేర్కొన్నారు. అవసరమైన చోట చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ నగదు తరలింపును అడ్డుకోవడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీతో పాటు ఇతర అధికారులు సీపీ వెంట ఉన్నారు.

Next Story