నూపుర్ శర్మను అరెస్టు చేయాలని హైదరాబాద్‌లో నిరసనలు
Protests demanding arrest of Nupur Sharma, Naveen Jindal held in Hyderabad. ప్రవక్త మహమ్మద్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను
By Medi Samrat Published on
10 Jun 2022 11:41 AM GMT

ప్రవక్త మహమ్మద్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైద్రాబాద్ నగరంలో నిరసనలు చేపట్టారు. మక్కా మసీదు వద్ద ప్రార్థనలకు హాజరైన యువకుల బృందం మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరింది. నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను అరెస్టు చేయాలని వారు నినాదాలు చేశారు. నగరంలోని కాలాపతేర్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, షాహీన్‌నగర్, సైదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో నిరసనలు జరిగాయి. ముందుజాగ్రత్త చర్యగా చార్మినార్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Next Story