అఖిలేష్ పహిల్వాన్ అరెస్టు

విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ నగరం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jan 2024 5:01 PM IST
అఖిలేష్ పహిల్వాన్ అరెస్టు

విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ నగరం అబిడ్స్‌లోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు 34 సంవత్సరాల రామ్‌నగర్ పహిల్వాన్ సాలువాడి అఖిలేష్, అబిడ్స్‌లోని బిగ్ బజార్ లేన్‌లో ఉన్న ఫార్చ్యూన్ హోటల్ యజమాని, ఆపరేషన్ సమయంలో పట్టుబడ్డారు. ఖచ్చితమైన సమాచారంతో జరిపిన ఈ దాడిలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ వ్యక్తులకు ఈ వ్యభిచార రాకెట్ లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్‌ అఖిల్‌ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అఖిలేష్, తన సహచరుడు పక్కాల రఘుపతి సహకారంతో తెలిసిన వ్యక్తుల నెట్‌వర్క్ ద్వారా మహిళా సెక్స్ వర్కర్ల సమాచారం సంపాదించాడు. ఈ ఆపరేషన్‌లో నిందితులుగా పేర్కొంటున్న వారిలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పీకే, ప్రబాత్ మజుందర్, ముఖేష్, సిమానీ, రాజు భాయ్, దీపక్, సికింద్రాబాద్‌లోని బోయినపల్లికి చెందిన నాని ఉన్నారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. విచారణలో రఘుపతి రిసెప్షనిస్ట్‌గానూ.. సబ్-బ్రోతల్ ఆర్గనైజర్‌గా పని చేస్తూ ఉన్నాడని తేలింది. అఖిలేష్ సూచనల మేరకు విటుల దగ్గర నుండి రూ. 3000 నుండి 5000 వరకూ వసూలు చేస్తున్నారు. అఖిలేష్ మొబైల్‌లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్‌ రోజుకి 20 నుంచి 30 కాల్స్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్‌ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచారు. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా ఉద్యోగావకాశాల సాకుతో అమాయక మహిళలను లోబరచుకున్నట్లు తదుపరి విచారణలో తేలింది. పశ్చిమ బెంగాల్, ముంబైకి చెందిన మొత్తం 16 మంది బాధిత మహిళలను రక్షించారు. అఖిలేష్‌తో పాటు నలుగురు కస్టమర్లు, ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన బాధితులు హైదరాబాద్ రాగానే ఇలాంటి పనుల్లోకి నెట్టి వేస్తున్నారు. మొత్తం నెట్‌వర్క్‌ వివరాలను తెలుసుకోడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులను తదుపరి విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సెక్షన్ 370, 370A IPC, 3, 4, 5 PIT ACT కింద కేసు బుక్ చేశారు. అఖిలేష్ కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని.. పలు కోణాలలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story