హైదరాబాదు విశ్వవిద్యాలయం (యుఓహెచ్) తెలుగు డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీవేత్త యెండ్లూరి సుధాకర్ శుక్రవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ప్రొఫెసర్ సుధాకర్ 1959 జనవరి 21న నిజామాబాద్ లోని పాముల బస్తీలో జన్మించారు. సికింద్రాబాద్‌లోని వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలలో 1985 నుండి 1990 వరకు తెలుగు పండిట్‌గా పనిచేశారు.
తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకు సహాయ సంపాదకునిగా, సంపాదకులుగా పనిచేశారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా సేవలందించారు. 1994 నుండి 2012 వరకు అడ్వాన్స్‌డ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారని హైదరాబాదు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు దివంగత సుధాకర్ యొక్క సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.