హైదరాబాద్ కు వస్తున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi is coming to Hyderabad. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

By Medi Samrat  Published on  7 May 2023 3:59 PM IST
హైదరాబాద్ కు వస్తున్న ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఆమె హాజరుకానున్నారు. ప్రియాంక సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు. నిరుద్యోగుల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

బీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్ధులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికోసం ఏం చేస్తామో చెప్పేందుకే యూత్ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మే8న జరిగే ఈ యూత్ డిక్లరేషన్‌ సభకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు హాజరుకావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలో రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించినట్లుగానే సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు.


Next Story