Video: శంకర్‌పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. క్షణాల్లో కారు దగ్ధం

రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం మహాలింగపురం సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

By -  అంజి
Published on : 28 Nov 2025 8:03 AM IST

Private travel bus collides with car, Shankarpally, Rangareddy district, Telangana

Video: శంకర్‌పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. క్షణాల్లో కారు దగ్ధం

రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం మహాలింగపురం సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు (TS12UC2500), శంకర్‌పల్లి దిశగా వెళ్తున్న సమయంలో మితిమీరిన వేగంతో వెళ్లి కారు (TS19A-6083)ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు విపరీతంగా వ్యాపించడంతో అది గమనించిన స్థానికులు వెంటనే పరుగెత్తి వెళ్లి కారు డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు రప్పించారు.

డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈఘటనలో కారు మొత్తం మంటల్లో దగ్దం అయింది. బస్సులో ఉన్న ప్రయాణీకులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తృటిలో తప్పిపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story