తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం

Preventing misinformation is key. అమెరికా, భారత్ ల‌ ప్రజాస్వామ్యానికి తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం

By Nellutla Kavitha  Published on  1 Aug 2022 12:31 PM GMT
తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం

అమెరికా, భారత్ ల‌ ప్రజాస్వామ్యానికి తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం అని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని అమెరికన్ కార్నర్‌లో జరిగిన వర్క్ షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసత్య, అర్ధ సత్య వార్తలను ఛేదించటంపై ఏపీ, తెలంగాణలోని టీవీ జర్నలిస్టులకు ఈ శిక్షణ ఇస్తున్నాం అన్నారు. ఈ శిక్షణ పూర్తి అయిన తర్వాత తప్పుడు వార్తలను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తారని మేం భావిస్తున్నాం అన్నారు డేవిడ్. అమెరికా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని, భవిష్యత్తు లో మరింత బలోపేతం అయ్యేందుకే ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు డేవిడ్ మోయర్.

ఫ్యాక్ట్ చెక్‌కు సంబంధించిన ప్రాధమిక అంశాలను, టూల్స్‌ను ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ ట్రైన‌ర్‌ సుధాకర్ రెడ్డి వివరించారు. తప్పుడు సమాచారం. హ్యాష్‌ట్యాగ్‌లు, అల్గారిథమ్‌లు, సోషల్ మాబ్‌లు, ట్రోల్ ఫామ్‌లు, మీడియా మానిప్యులేషన్‌ల ప్రపంచంలో మనం జీవిస్తున్నందున, తప్పుడు సమాచారాన్ని తొలగించడం చాలా కీలకంగా మారిందని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్-చెక్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఉడుముల అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్‌సన్ కోహిర్.. సామాన్య ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆంధ్రా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి మాట్లాడుతూ.. సమాచారం యొక్క వరద నుండి వాస్తవాలను జల్లెడ పట్టడానికి క్రిటికల్ థింకింగ్ టెక్నిక్‌లను ఉపయోగించాలని అన్నారు.

యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా తెలుగు టీవీ రిపోర్టర్లకు అసత్య, అర్ధ సత్య వార్తలను ఛేదించటంపై ప్రత్యేక కోర్సును నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థులకు ఇవాళ వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఫ్యాక్ట్ చెక్ శిక్షకులు సుధాకర్ రెడ్డి ఉడుముల, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖ ప్రొ. స్టీవెన్ సన్, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ప్రొ. మూర్తి, ఇతరులు హాజరయ్యారు.


Next Story