అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేయ్యండి

Posani Krishna Murali About GHMC Elections. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించాలని

By Medi Samrat  Published on  21 Nov 2020 8:41 AM GMT
అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేయ్యండి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించాలని టాలీవుడ్ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి హైద్రాబాద్ ప్ర‌జానీకాన్ని కోరారు. శ‌నివారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. తాను 35 యేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాన‌ని.. గ‌తంలో హైదరాబాధ్ అంటే మత కల్లోలాలు గుర్తొచ్చేవని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మత కల్లోలాలు ఆగిపోయాయని అన్నారు.

ఎన్టీఆర్ తరువాత హైదరాబాద్‌లో కేసీఆరే హైదరాబాద్‌లో మత కల్లోలాలు లేకుండా చేశారని అన్నారు. గతంలో ఆంధ్రప్ర‌దేశ్‌తో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం ఉండేది కాదని.. కానీ కేసీఆర్ వచ్చాక తెలంగాణ అంతా పచ్చగా మారింద‌ని అన్నారు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్న‌ప్పుడు కూడా ఆంధ్ర నాయకుల మీదనే కోపం ఉండేదని.. ఆంధ్ర అంటే కాదని.. కేసీఆర్ వస్తే ఆంధ్ర వారిని తరిమి కొడతారని అప్పట్లో ప్రచారం జరిగేదని.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఆంధ్ర వారి మీద దాడి జరిగిన ఘటనలు లేవని పోసాని అన్నారు.


Next Story