హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. ఫొటో ఫ్రేమ్స్‌ వెనుక పెట్టి పార్శిల్స్‌

Police seized 14 kgs drugs seized in hyderabad. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. 14 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటలో

By అంజి  Published on  11 Nov 2021 4:55 PM IST
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. ఫొటో ఫ్రేమ్స్‌ వెనుక పెట్టి పార్శిల్స్‌

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. 14 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటలో ఇంటర్‌నేషనల్‌ పార్శిల్స్‌ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 14 కిలోల డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. ఫోటోస్ ఫ్రేమ్‌ వెనుక డ్రగ్స్‌ పెట్టి పార్శిల్స్‌ చేసి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్‌ను హైదరాబాద్‌ నుండి ఆస్ట్రేలియా దేశానికి పంపుతున్నారని తెలిసింది. ఇప్పటి వరకు 300 కిలోల డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు నిర్దారించారు. డీఆర్‌ఐతో పాటు నార్త్‌ జోన్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ దాడులు చేపట్టారు.

పార్శిల్ కార్యాలయంలో పని చేసే ఓ వ్యక్తి సమాచారం ఆధారంగానే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 25 ఫొటో ఫ్రేములు ఉండగా 11 ఫొటో ఫ్రేముల్లో డ్రగ్స్‌ దొరికాయి. ఇది వరకు చిన్న పిల్లల ఆట వస్తువులు, బ్యూటీషీయన్‌ వస్తువుల్లో డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేకుండా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇటీవల ఎక్సైజ్‌, పోలీసు అధికారులకు ఆదేశిలిచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు చేపడుతున్నారు. డ్రగ్స్‌ ఉన్నాయని చిన్న క్లూ లభించిన వదలడం లేదు.

Next Story