రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో దువ్వాడ మాధురి బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో సహా కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్ డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్కా బాటిళ్లను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.