శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫేక్ వీసాల గుట్టురట్టయింది. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళలను ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఆ మహిళలను ఏజెంట్ మోసం చేశాడనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఆ మహిళలు ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. కువైట్ వెళ్లేందుకు 40 మందికి పైగా మహిళలు ప్రయత్నం చేశారు. వీసాలను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు..ఆ వీసాలు ఫేక్ అని గుర్తించారు.
తదుపరి విచారణ కోసం ఆర్జీఐ పోలీసులకు అధికారులు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కువైట్ నుండి వస్తున్న ప్రయాణికుడి వద్ద 233.20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి హైదరాబాద్ వస్తున్న గుర్ర నరేందర్ అనే ప్రయాణికుని వద్ద 11.49లక్షల విలువ చేసే అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.