28న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
PM Modi to Visit Hyderabad.. ప్రధాన నరేంద్ర మోదీ ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన
By సుభాష్ Published on 26 Nov 2020 8:10 PM ISTప్రధాన నరేంద్ర మోదీ ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 28న ఢిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట సమీపంలోని భారత్ బయోటెక్‌ను సదంర్శించనున్నారు. కరోనా నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న 'కోవాగ్జిన్' టీకా పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం మోదీ పుణె పర్యటనకు వెళ్లనున్నారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా.?లేదా? అనేది తెలియాల్సి ఉంది.
భాగ్యనగరానికి మరి కొందరు బీజేపీ అగ్రనేతలు
కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 28న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు రానున్నారు. వీరంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొననున్నారు.