హైదరాబాద్ శివార్లలో మరోసారి రెచ్చిపోయిన స్నాచర్స్( Video)

హైదరాబాద్‌ శివార్లలో స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు

By -  Knakam Karthik
Published on : 10 Feb 2026 11:55 AM IST

Hyderabad, Vanasthalipuram, Phone Snaching, HYD Police

హైదరాబాద్ శివార్లలో మరోసారి రెచ్చిపోయిన స్నాచర్స్( Video)

హైదరాబాద్‌ శివార్లలో స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.ఎన్. రెడ్డి నగర్, వినాయక హిల్స్ కాలనీలో అర్ధరాత్రి వేళ జరిగిన ఫోన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వినాయక హిల్స్ రోడ్డు నంబర్ మూడులో అర్ధరాత్రి ఒకటిన్నర గంటల (1:30 AM) సమయంలో ఈ చోరీ జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటిముందు బైక్ ఆపి పార్క్ చేస్తున్న సమయంలో వేరే బైక్ పై అతనివద్దకు వచ్చిన ఇద్దరు దొంగలు..ముందు బండి నడిపే దొంగ బైక్ నిలపగానే.. వెంటనే వెనుక కూర్చున్న దొంగ ఒక్కసారిగా యువకుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని మెరుపు వేగంతో అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఆకస్మిక పరిణామంతో కొన్ని క్షణాలపాటు నిస్తేజంగా ఉండిపోయిన యువకుడు వెంటనే తన బైక్‌పై వారిని వెంబడించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అర్థరాత్రి కావడంతో నిర్మానుష్యంగా ఉన్న వీధులు...దీంతో దొంగలు వేగంగా అక్కడి నుండి ఉడాయించారు. బి.ఎన్. రెడ్డి వినాయక హిల్స్ రోడ్డు నంబర్ మూడు అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఈ స్నాచింగ్ ఘటన జరిగినట్లు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసిటీవి ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

Next Story