న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

న్యూ ఇయర్ వేడుకలపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు.

By -  Medi Samrat
Published on : 20 Dec 2025 9:10 PM IST

న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

న్యూ ఇయర్ వేడుకలపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. టికెటెడ్ ఈవెంట్ నిర్వహిస్తే ముందుగానే అనుమతి తీసుకోవాలని, ఎంతమంది వస్తున్నారు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో నిర్వాహకులు సమాచారం ఇవ్వాలన్నారు. పార్కింగ్ ఎలా ఉందో కూడా చెప్పాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఈవెంట్ నిర్వాహకులదే బాధ్యత అని హెచ్చరించారు. 15 రోజుల ముందుగానే అనుమతి కోసం అప్లె చేసుకోవాలన్నారు. ఈవెంట్ నిర్వహించే రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొందరు సరైన పార్కింగ్ సదుపాయం లేకున్నా ఎక్కువమందిని ఈవెంట్ కు తీసుకువస్తారని దాని వల్ల రోడ్డుపై వాహనాలు పెడతారని చెప్పారు. వాహనదారులు తాగి నడిపితే కఠిన చర్యలు తసుకుంటామని, రోడ్డుపై స్టంట్స్ చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని అన్నారు.

Next Story