జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యుసెన్స్ ఎక్కువైందంటూ కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి రెండు, మూడు గంటల వరకూ పబ్ మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువకులు పబ్ లో తాగేసి బాటిల్స్ పక్కనున్న ఇళ్లలోకి విసురుతున్నారని కాలనీ వాసులు వాపోయారు.
ఇళ్లలో వృద్ధులు, పెద్దవారు, చిన్నవారికి టాట్ పబ్ తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలు వంటివి చేయడంతో సదరు పబ్‌పై పలు కేసులు కూడా నమోదయ్యాయని అంటున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే పబ్ ను ఇళ్ల మధ్య నుండి తీసివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.