ఆరు కార్లను రిజిస్ట్రేషన్ చేయించిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan New Vehicles Registration. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాదులోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు.

By M.S.R
Published on : 23 Dec 2022 6:54 PM IST

ఆరు కార్లను రిజిస్ట్రేషన్ చేయించిన పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాదులోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. 6 కొత్త వాహనాలకు పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు పవన్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ తో పాటు పవన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కూడా పొందారు. ఈ ప్రక్రియను డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అధికారి రాంచందర్ పర్యవేక్షించారు. పవన్ రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాల్లో టయోటా వెల్ ఫైర్, బెంజి కారు, జీప్ ర్యాంగ్లర్, రెండు స్కార్పియో కార్లు, టాటా యోధ పికప్ ట్రక్ ఉన్నాయి.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ప్రస్తుతం సాంగ్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ 'వీరసింహారెడ్డి' సెట్స్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న వీరిసింహారెడ్డి సినిమా సెట్స్‌లో పవన్ కొద్దిసేపు సందడి చేశాడు. బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కొద్దిసేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో కూడా కనిపించే అవకాశం ఉందని రూమర్లు కూడా గత కొద్దిరోజులుగా వస్తూ ఉన్నాయి.


Next Story