Hyderabad: గంజాయి విక్రయిస్తున్న పానీపూరీ వ్యాపారి అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో పానీపూరీ వ్యాపారం ముసుగులో గంజాయి దందా నడుస్తోంది. తాజాగా పానీపూరీ వ్యాపారిని హైదరాబాద్‌ కమిషనర్‌

By అంజి  Published on  7 Jun 2023 10:46 AM IST
Panipuri trader , ganja , Hyderabad, Crime news

Hyderabad: గంజాయి విక్రయిస్తున్న పానీపూరీ వ్యాపారి అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో పానీపూరీ వ్యాపారం ముసుగులో గంజాయి దందా నడుస్తోంది. తాజాగా పానీపూరీ వ్యాపారిని హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం అరెస్ట్‌ చేసి అతడి నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అబిడ్స్‌కు చెందిన ముస్తాపూర్ ప్రశాంత్ అనే వ్యక్తి అబిద్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ గేటు ముందు వినియోగదారులకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించాడు. ప్రశాంత్ తాజ్ మహల్ హోటల్ ఎక్స్ రోడ్ దగ్గర ఒకటి, భారతి విద్యాభవన్ రోడ్ వద్ద మరొకటి పానీ పూరీ స్టాల్స్ నడుపుతున్నాడు.

రోజురోజుకు పెరిగిపోతున్న దుబారా ఖర్చులకు అతడి వ్యాపారం సరిపోకపోవడంతో హైదరాబాద్‌లో గంజాయికి విపరీతమైన గిరాకీ ఉండడంతో దాన్ని అమ్మేందుకు ప్లాన్‌ వేసుకున్నాడు. ''అతని పథకం ప్రకారం.. అతను ధూల్‌పేటలోని జాలి హనుమాన్‌లో నివసించే యశ్వంత్ అలియాస్ గౌతమ్ (25) అనే వ్యక్తి నుండి గంజాయిని రూ. 25,000కు కిలో కొని.. రూ.45,000కు విక్రయించాలని నిర్ణయించాడు. పథకం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రామకృష్ణ థియేటర్ గేట్ దగ్గరకు వచ్చి వినియోగదారులకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించాడు. చివరికి అతను పోలీసులకు పట్టుబడ్డాడు'' అని డిసిపి టాస్క్ ఫోర్స్ పి రాధా కిషన్ రావు తెలిపారు.

Next Story