హైదరాబాద్‌లో పాకిస్తానీ వ్యక్తి అరెస్టు.. భార్య కోసం వచ్చి..

నేపాల్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేశారు.

By అంజి
Published on : 26 April 2025 7:04 AM IST

Pakistani Man, Arrest, Hyderabad

హైదరాబాద్‌లో పాకిస్తానీ వ్యక్తి అరెస్టు.. భార్య కోసం వచ్చి..

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అందరి హృదయాలను కదిలించి వేసింది. దీంతో దేశ ప్రధానమంత్రి మోదీ.. పాకిస్తాన్ దేశస్థులందర్నీ భారతదేశం వదిలి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమై హైదరాబాదు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పాత బస్తితో పాటు సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెట్టింది.

ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పాకిస్థాన్‌కు చెందిన వారందరూ ఇక్కడ నుండి వెళ్లిపోయేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఓ పాకిస్తానీ యువకుడు తన భార్య కోసం అక్రమంగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి.. పోలీసుల చేతికి చిక్కాడు. పాకిస్తాన్ కి చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే ఫయాజ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న కారణంగా.. అతని భార్య హైదరాబాదులో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్ద ఉంది. ఆ యువతి కి ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెను కలవడానికి ఫయాజ్ పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇంతలో పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం అందడంతో వెంటనే ఫయాజ్‌ను అదుపు లోకి తీసుకున్నారు. తన భార్య ప్రెగ్నెన్సీ కావడంతో... సంతో షంతో ఆమెను చూడడానికని వచ్చానని ఫయాజ్ వెల్లడించారు. కానీ ఇప్పటి దేశ పరిస్థితుల దృష్ట్యా ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Next Story