స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న‌ ఒవైసీ సోదరులు

Owaisi brothers hoist Tricolour in Hyderabad. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పాతబస్తీలో

By Medi Samrat  Published on  15 Aug 2022 7:32 AM GMT
స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న‌ ఒవైసీ సోదరులు

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. చారిత్రక చార్మినార్ సమీపంలోని మదీనా సర్కిల్ వద్ద అసదుద్దీన్ ఒవైసీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అసదుద్దీన్ ఒవైసీ వెంట పార్టీ స్థానిక నాయకులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

అంత‌కుముందు అసదుద్దీన్ ట్విటర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. "మన పూర్వీకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారు ఆకలి, దోపిడీ, దౌర్జన్యం లేని భారతదేశం కోసం పోరాడారు. వారి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అల్లాహ్ మన దేశాన్ని ద్వేషం, అణచివేత నుండి రక్షించుగాక" అని ట్వీట్ చేశారు.

ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. AIMIM ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ కార్యదర్శి ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.


Next Story