జనవరి 30 వరకు సెలవులు పొడిగించిన ఓయూ
OU extends holidays till Jan 30. ఉస్మానియా యూనివర్శిటీ జనవరి 17 నుండి 30 వరకు కళాశాలల సెలవులను
By Medi Samrat
ఉస్మానియా యూనివర్శిటీ జనవరి 17 నుండి 30 వరకు కళాశాలల సెలవులను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అన్ని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ పత్రికా ప్రకటనలో తెలిపింది. సెలవుల నేఫథ్యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఓయూ అడ్మినిస్ట్రేషన్ తమ పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాల్‌లను ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి వారి ప్రదేశాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలావుంటే.. తెలంగాణలో నేటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. రేపటి నుండి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మరోసారి ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల సెలవులను 30. 1. 2022 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొదట స్కూల్స్, కాలేజీలు మూసి వేసి ఆన్‌లైన్ క్లాసులు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో థర్డ్‌వేవ్ ముంచుకోస్తుండటంతో ప్రభుత్వం స్కూళ్లకు సెలువులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది