జనవరి 8 నుంచి 16 వరకు జ‌ర‌గాల్సిన‌ అన్ని పరీక్షలు వాయిదా

Osmania University postpones all examinations. ఉస్మానియా యూనివర్సిటీ జనవరి 8 నుంచి 16 వరకు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను

By Medi Samrat  Published on  6 Jan 2022 1:56 PM GMT
జనవరి 8 నుంచి 16 వరకు జ‌ర‌గాల్సిన‌ అన్ని పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ జనవరి 8 నుంచి 16 వరకు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను నిర్ణీత సమయంలో విడుదల చేస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ గురువారం తెలిపింది.

ఇదిలావుంటే.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం నిర్ణయించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.

ఒమిక్రాన్ దృష్ట్యా సంక్రాంతి సెలవులు ముందుగానే ఇచ్చారు. అయితే సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కరోనా పరిస్థితులను బట్టి విద్యాసంస్థలు తెరవనున్నారు. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ.. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే సెలవులు ముందుగానే ప్రకటించారు.


Next Story