ఒప్పో(oppo) ఇండియా హైదరాబాద్ లోని R&D సెంటర్‌లో ప్రత్యేకమైన పవర్, పెర్ఫార్మెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. పరికరాలను మరింత శక్తివంతం చేయడానికి, కొత్త ఆవిష్కరణలకు ల్యాబ్ కేంద్రంగా పనిచేస్తుంది. అత్యాధునిక సాధనాలు, సౌకర్యాలతో కూడిన ఈ ల్యాబ్ లో గేమింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో కాలింగ్, స్ట్రీమింగ్ వంటి వాటికి ఉపయోగించే పరికరాలను పరీక్షించవచ్చు. సాఫ్ట్‌వేర్ బగ్ టెస్టింగ్, సున్నితమైన పనితీరు, అధిక బ్యాటరీ లైఫ్ వంటి కీలకమైన సమస్యలను ఎదుర్కొనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ OS స్థాయిలలో మార్పులపై కూడా నిపుణులు దృష్టి పెట్టనున్నారు.
OPPO గత 2 సంవత్సరాలలో హైదరాబాద్ R&D సెంటర్‌లో 5G ఇన్నోవేషన్ ల్యాబ్ , కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్‌లను కూడా ప్రారంభించింది. భారతదేశ R&D కేంద్రంలో 450 మంది సభ్యుల బృందం ఉంది. OPPO నిర్దిష్ట లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఉప-ల్యాబ్‌లను పరిచయం చేయాలని భావిస్తోంది.2022లో, OPPO 150W SuperVOOC ఛార్జర్‌తో పాటు బ్యాటరీ హెల్త్ ఇంజిన్, 240W SuperVOOC ఛార్జర్‌తో హై స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీలను ప్రారంభించింది. 150W SuperVOOC ఛార్జింగ్ టెక్నాలజీ 4500mAh బ్యాటరీని 5 నిమిషాల్లో 1 నుండి 50% వరకు ఛార్జ్ చేయగలదు. 15 నిమిషాల్లో 100% ఛార్జ్ చేయగలదు. 240W SuperVOOC ఛార్జర్ 4200mAh బ్యాటరీని 9 నిమిషాల్లో 100% వరకు ఛార్జ్ చేయగలదు.