హైదరాబాద్‌లో నూతన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
OpenBlue Innovation Centre at Hyderabad. స్మార్ట్, హెల్తీ సస్టెయినబల్ బిల్డింగ్స్ కోసం అంతర్జాతీయంగా అగ్రగామిగా
By Medi Samrat Published on 14 Jun 2022 10:45 AM GMTస్మార్ట్, హెల్తీ సస్టెయినబల్ బిల్డింగ్స్ కోసం అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న జాన్సన్ కంట్రోల్స్ మంగళవారం అధికారికంగా తమ నూతన, అత్యాధునిక, ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఇంజినీరింగ్, ఎక్స్‌లెన్స్ కోసం తెరిచినట్లు వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.
సాంకేతికతలో భాగంగా అత్యంత కీలకమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి.. దేశంలో రాష్ట్రం టెక్ ఇన్నోవేషన్, ప్రతిభావంతుల కేంద్రంగా నిలువాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా హైదరాబాద్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు అత్యంత కీలకమైనదని కేటీఆర్ అన్నారు. జాన్సన్ కంట్రోల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం, ఈ కేంద్రం ఏర్పాటు పట్ల మేము గర్వంగా ఉన్నామని అన్నారు.
ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రం 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఏరియాలో గౌర ఫౌంటెన్‌హెడ్ వద్ద ఉంది. దేశంలోని ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్లైన (పూణే, గుర్‌గావ్, బెంగళూరు, ఢిల్లీ) నెట్‌వర్క్‌లతో చేరుతుంది. దీంతో పాటు భారతదేశంలో జాన్సన్ కంట్రోల్స్ ఉనికిని సైతం విస్తరిస్తుంది. ఈ ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధానంగా సెక్యూరిటీ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇంటిలిజెంట్ ఎడ్జ్ ఉపకరణాలు వినియోగించి వినియోగదారుల అనుభవాలను సమూలంగా మార్చేందుకు ఇది అంకితమై ఉంది.
''ఐఓటీ, ఏఐ, 5జీ రూపంలో నూతన 5వ వేవ్ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పనితీరును ఉన్నతంగా మెరుగుపరుస్తూనే డీకార్బనైజేషన్, సస్టెయినబిలిటీ, ఇంధన సామర్ధ్యం, పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను అందించే రీతిలో భవంతులు పునరావిష్కరింప చేయబడుతున్నాయని జాన్సన్ కంట్రోల్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, విజయ్ శంకరన్ అన్నారు. ఈ నూతన సెంటర్.. బిల్డింగ్ టెక్నాలజీలో మా నూతన ఆవిష్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాన్సన్ కంట్రోల్స్ యొక్క ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రాల నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఉంటుందని అన్నారు.
ఈ నూతన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ కోసం ఎసెంచర్‌తో జాన్సన్ కంట్రోల్స్ భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఎసెంచర్ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. వారి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బృందాలు నేరుగా జాన్సన్ కంట్రోల్స్ అత్యున్నత శ్రేణి సాంకేతికతను ఉపయోగించేందుకు తోడ్పడతాయి. ఈ సాంకేతికతలలో 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), మెటావర్శ్ ప్లాట్‌ఫామ్స్ మరియు డిజిటల్ ట్విన్స్ వంటివి ఉంటాయి. ఈ సాంకేతికతలు, జాన్సన్ కంట్రోల్స్ ఓపెన్ బ్లూ ప్లాట్‌ఫామ్– కంపెనీ యొక్క ఏఐ ఆధారిత బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు అనుగుణంగా పనిచేస్తాయి. ఓపెన్ బ్లూ అనేది క్లౌడ్ ఆధారితంగా కనెక్ట్ చేయబడిన సొల్యూషన్స్, సేవల సూట్. ఇది వినియోగదారుల ప్రస్తుత ఐటీ, కార్యాచరణ సాంకేతికతతో కలిసిపోతుంది.