Hyderabad: స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌లో సోమవారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది.

By అంజి  Published on  12 Aug 2024 11:49 AM IST
school bus, Shamshabad, Hyderabad

Hyderabad: స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌లో సోమవారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద బెంగళూరు హైవే క్రాస్‌ చేస్తున్న పాదాచారుడిని స్కూల్‌ బస్సు ఢీ కొట్టింది. గాల్లోకి ఎగిరి బస్సు మీద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ నేరుగా ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె సమీపంలో స్కూల్‌ బస్సు బోల్తా పడింది. విద్యార్థులతో బయల్దేరిన శ్రీవాణి పాఠశాల బస్సు.. రాయిపైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డోర్‌ పక్కనే ఉన్న విద్యార్థిని భవిష్య (8) మృతి చెందింది. మరికొందరికి గాయాలు అయ్యాయి.

Next Story