Video : హమ్మయ్య.. ఆ భవనం కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం
మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేతలకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
By Medi Samrat
మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేతలకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాట్ నెంబర్ 1639 లో ఉన్న 70 గజాల స్థలంలో వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి కనీస ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణం చేపట్టాడని తేలింది. ఆ భవనంలో మొత్తం 50 మంది నివాసం ఉన్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. కేవలం 50 గజాలలో ఐజంతస్తుల భవనం నిర్మించడంతో అధికారులు సీరియస్ అయ్యారు. 60 శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లుగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు.
#Hyderabad--
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 20, 2024
మాదాపూర్లోని సిద్ధిక్నగర్లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. ఇది నివాసితులను భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న హైడ్రామా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో నివసిస్తున్న 30 మంది తృటిలో తప్పించుకున్నారు. pic.twitter.com/4fVIzCuS7s
సిద్ధిక్ నగర్‌లో ఉన్న ఐదు అంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడంతో మంగళవారం రాత్రి స్థానికులు, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భవనం ఒక పక్కకు ఒరిగిందన్న సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ అథారిటీ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెన్స్ (హైడ్రా) పరిస్థితిపై వెంటనే స్పందించింది. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్కకు ఒరిగిన భవనం, చుట్టుపక్కల నిర్మాణాల నుండి జనాన్ని ఖాళీ చేయించారు, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో సమీపంలోని భవనాలలో ఉన్నవారు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది.