ఫిబ్రవరి 25 నుండి నుమాయిష్‌

Numaish to reopen from February 25. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా ప్రారంభమైన ఒక రోజు తర్వాత

By Medi Samrat  Published on  15 Feb 2022 3:10 AM GMT
ఫిబ్రవరి 25 నుండి నుమాయిష్‌

కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా ప్రారంభమైన ఒక రోజు తర్వాత అకస్మాత్తుగా మూసివేయబడిన నుమాయిష్ మ‌ళ్లీ తెర‌చుకుంటుంది. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గా ప్ర‌సిద్ధి గాంచిన ఈ వార్షిక వాణిజ్య స‌ముదాయం ఫిబ్రవరి 25 నుండి తిరిగి తెరవబడుతుంది. రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి థ‌ర్డ్ వేవ్‌ ముగిసిందని ఆరోగ్య శాఖ‌ అధికారులు ప్రకటించడంతో.. ఎగ్జిబిషన్ సొసైటీ ఫిబ్రవరి 25 నుండి నుమాయిష్‌ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేసింది.

ఈ విష‌య‌మై ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం మాట్లాడుతూ, "కోవిడ్-19 యొక్క నూత‌న వేరియంట్‌ ఓమిక్రాన్ కేసులు గణనీయంగా తగ్గడంతో అన్ని సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడం జ‌రిగింద‌ని.. ఈ నేఫ‌థ్యంలోనే ఎగ్జిబిషన్ సొసైటీ ఫిబ్రవరి 25 నుండి 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్-2022(నుమాయిష్‌)ని పునఃప్రారంభించేందుకు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుండి అనుమతి పొందిందని తెలిపారు.


Next Story