రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మ‌కానికి నోటి‌ఫి‌కే‌షన్‌

Notification for sale of Rajiv Swagruha flats.బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లలో ఫ్లాట్ల అమ్మకానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2022 10:07 AM IST
రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మ‌కానికి నోటి‌ఫి‌కే‌షన్‌

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లలో ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. బండ్ల‌గూడ‌లో నిర్మాణం పూరైన 419 ఫ్లాట్ల‌ను చ‌ద‌ర‌పు అడుగుకు రూ.3 వేలు, అసం‌పూ‌ర్తిగా ఉన్న 1,082 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.2,750, పోచా‌రంలో పూర్త‌యిన 1,328 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.2500, కొద్ది అసం‌పూ‌ర్తిగా ఉన్న 142 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.2,250 చొప్పున ధ‌ర‌ను నిర్ణ‌యించారు. రేప‌టి నుంచి జూన్ 14 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో లాటరీ పద్ధ‌తిలో లబ్ధి‌దా‌రులను ఎంపిక చేస్తారు. మీ సేవ పోర్ట‌ల్‌, స్వ‌గృహ వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ద‌ర‌ఖాస్తుచేసుకోవ‌చ్చు.

రాజీవ్‌ స్వగృహ ఇళ్ల‌ అమ్మ‌కాల ప్రక్రి‌యను వేగంగా పూర్తి చేయా‌లని సీఎస్‌ సోమే‌శ్‌‌కు‌మార్‌ అధి‌కా‌రు‌లను ఆదే‌శిం‌చారు. సోమ‌వారం బీఆ‌ర్కే‌భ‌వ‌న్‌లో హౌసింగ్‌ అధి‌కా‌రు‌లతో ఆయన సమీక్ష నిర్వ‌హిం‌చారు. మధ్య తర‌గతి ప్రజలు ఈ ఇళ్ల‌ను కొను‌గోలు చేస్తా‌రని, సులభ దర‌ఖా‌స్తుకు వీలుగా మాడ్యూల్‌ రూపొం‌దిం‌చా‌లని సూచిం‌చారు. అప్లి‌కే‌షన్‌ ప్రక్రియ అసాంతం ఆన్‌‌లై‌న్‌‌లోనే స్వీక‌రిం‌చా‌లని ఆదేశించారు. కాగా.. ముందుగా బ్లాకుల వారీగా గంపగుత్తగా అమ్మాలని చూసిన ప్ర‌భుత్వం..కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవ‌డంతో.. ఫ్లాట్లను వేర్వేరుగా అమ్మాలని నిర్ణయం తీసుకుంది.

Next Story