హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రిపురం, బండ్లగూడ భోజగుట్ట, చింతల్ బస్తీ, షేక్‌పేట్ అల్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, లాలాపేట్, సాహెబ్‌నగర్ ఉన్నాయి. ఆటోనగర్, సరూర్‌నగర్, సైనిక్‌పురి, మౌలాలి, స్నేహపురి, కైలాస్‌గిరి, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, బోడుప్పల్, మల్లికార్జున నగర్, చెంగిచెర్ల, పీర్‌జాదిపూర్‌గుడ, జిమ్మత్‌గూడ, పీర్‌జాదిపూర్‌గూడలో కూడా తాగునీటి సరఫరా నిలిచిపోతుంది. కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్-3 పైప్‌లైన్ల లీకేజీలను సరిచేసేందుకు చేపట్టిన పనులు, కొండాపూర్ పంపింగ్ స్టేషన్‌లో పనుల కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పత్రికా ప్రకటనలో అభ్యర్థించింది.