ఓలా యాప్‌లో మార్పులు.. రైడ్ బుక్‌ చేస్తే క్యాన్సిల్ ఉండ‌దు

No cancel by OLA cab rider says OLA cab. కస్టమర్లను రైడ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టుకుండా ఉండేందుకు కోసం ఓలా యాప్‌ చర్యలు చేపట్టింది. చాలా మంది ప్రయాణికులు తమ

By అంజి  Published on  23 Dec 2021 3:46 AM GMT
ఓలా యాప్‌లో మార్పులు.. రైడ్ బుక్‌ చేస్తే క్యాన్సిల్ ఉండ‌దు

కస్టమర్లను రైడ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టుకుండా ఉండేందుకు కోసం ఓలా యాప్‌ చర్యలు చేపట్టింది. చాలా మంది ప్రయాణికులు తమ గమ్యానికి చేరుకునేందుకు ఓలా, ఉబర్‌, ర్యాపిడో వంటివి ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటో, కారు బుకింగ్‌ చేసిన తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్‌లను క్యాన్సిల్‌ చేస్తున్నారు. దీంతో ఎంతో మంది ప్రయాణికులు రోడ్లపై వేచి చూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలా మంది ప్రయాణికులు ఈ విషయాన్ని ఇప్పటికే ఓలా యాప్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలోనే రైడ్‌ ప్రక్రియను క్యాన్సిల్‌ చేయకుండా యాప్‌లో ఓలా సంస్థ మార్పులు చేపట్టింది. రైడ్‌ రద్దు ప్రక్రియకు పరిష్కారం చూపెట్టింది. కస్టమర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే.. ఆ వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా యాప్‌లో మార్పులు చేసింది. దీంతో కస్టమర్‌ ఉన్న లొకేషన్‌, పేమెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్‌కు కనిపిస్తాయి. ఆ తర్వాత రైడ్‌ అంగీకారం అయితే ఒకే చేయవచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్‌ చేయకుండా ఉండాలి. అయితే ఈ మార్పుపై క్యాబ్‌ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story