హైదరాబాద్ జూలో చనిపోయిన అభిమన్యు

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో తొమ్మిది సంవత్సరాల రాయల్ బెంగాల్ టైగర్ అభిమన్యు చనిపోయింది.

By Medi Samrat  Published on  15 May 2024 7:00 AM GMT
హైదరాబాద్ జూలో చనిపోయిన అభిమన్యు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో తొమ్మిది సంవత్సరాల రాయల్ బెంగాల్ టైగర్ అభిమన్యు చనిపోయింది. దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం కారణంగా మే 14, మంగళవారం తుది శ్వాస విడిచింది. తెల్ల పులి అయిన అభిమన్యు 2015లో జూలో జన్మించాడు. ఏప్రిల్, 2023 నుండి స్టేజ్ I నెఫ్రైటిస్‌తో బాధపడుతూ వచ్చింది. చికిత్స చేసినప్పటికీ మెరుగుపడలేదు. ఈ సంవత్సరం మే 5 నుండి అభిమన్యు పరిస్థితి మరింత క్షీణించింది. కనీసం నడవలేకపోయాడని జూ నుండి ఒక ప్రకటన వచ్చింది.

ఈ నెల 12 నుంచి అభిమన్యు ఆహారం తీసుకోవటం తగ్గించింది. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా అభిమన్యు పరిస్థితి దారుణంగా తయారైంది. చివరికి తన ఎన్‌క్లోజర్‌లో మరణించాడు.

Next Story