కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ.. హిజ్జుత్ తహ్రీర్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న సల్మాన్‌ను అరెస్ట్ చేసింది. భారత్‌లో షరియా చట్టం అమలుకు హిజ్జుత్ తహ్రీర్ కుట్ర చేసింది. భోపాల్, హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో సలీం నేతృత్వంలో హిజ్జుత్ తహ్రీర్ కార్యకలాపాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి మే 24న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసింది.
హిజ్జుత్ తహ్రీర్‌లో సల్మాన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లుగా గుర్తించారు. అతడిని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, అతనికి చెందిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్‌తో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది మే 24న హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి, 16 మందిని అరెస్టు చేసింది. అప్పటి నుండి సల్మాన్ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. తాజాగా అతడి అరెస్టుతో ఆ సంఖ్య 17కు చేరింది.
ఇప్పటికే అరెస్టయిన నిందితుడు సలీం నేతృత్వంలోని hut మాడ్యూల్‌లో సల్మాన్ చురుకైన సభ్యుడు. సలీం, సల్మాన్‌తో పాటు హైదరాబాద్ మాడ్యూల్‌కు చెందిన మరో నలుగురు అరెస్టయిన నిందితులు, షరియత్ ఆధారంగా ఖలీఫాత్‌ను స్థాపించాలనే లక్ష్యంతో తమ సంస్థను విస్తరించేందుకు పనిచేశారు ముస్లిం యువకులను సంస్థలోకి చేర్చుకోవడం ద్వారా రహస్యంగా తన సంస్థను, క్యాడర్‌లను నిర్మించుకోవడానికి HuT ప్రయత్నిస్తున్నట్లు NIA పరిశోధనల్లో తేలింది.