పెళ్లై నెల రోజులు కాక‌ముందే.. అనుమానాస్ప‌ద స్థితిలో న‌వ వ‌ధువు మృతి

Newly married bride suspected death in Hyderabad old city.ఎన్నో ఆశ‌ల‌తో అత్త‌వారింట్లో అడుగుపెట్టింది ఓయువ‌తి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2021 9:10 AM IST
పెళ్లై నెల రోజులు కాక‌ముందే.. అనుమానాస్ప‌ద స్థితిలో న‌వ వ‌ధువు మృతి

ఎన్నో ఆశ‌ల‌తో అత్త‌వారింట్లో అడుగుపెట్టింది ఓయువ‌తి. అయితే..పెళ్లై నెల రోజులు కూడా కాక‌ముందే న‌వ వ‌ధువు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న పాత‌బ‌స్తీలోని రెయిన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. కుటుంబ స‌భ్యులు, పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. పాత‌బ‌స్తీకి చెందిన ర‌షీద్‌తో ష‌ఫియా ఫాతిమా(21) కు ఇటీవ‌ల వివాహం జ‌రిగింది. పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. అయితే ఏం జ‌రిగిందో తెలీదు కానీ.. వివాహం అయిన 27 రోజుల‌కే ఫాతిమా అత్తగారింట్లో అనుమానాస్థ‌ద స్థితిలో మృతి చెందింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. భ‌ర్త‌, అత్తింటి వారే ఫాతిమాను కొట్టి చంపార‌ని మృతురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుల‌పై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story